రక్షణశాఖ మీద కీలక నిర్ణయం తీసుకున్న మోడీ

రక్షణశాఖ మీద కీలక నిర్ణయం తీసుకున్న మోడీ

దేశ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఈరోజు ఎర్రకోటలో జెండా వందనం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. త్రివిధ దళాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే త్రివిధ దళాల సమన్వయం కోసం ఈ మూడిటికీ కలిపి ఒక చీఫ్ ను నియమించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఆ చీఫ్ ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)గా వ్యవహరించనున్నారని మోడీ పేర్కొన్నారు. సీడీఎస్ నియామకం ద్వారా సైనిక విభాగాల మధ్య మెరుగైన సమన్వయానికి అవకాశం ఏర్పడుతుందని మోడీ పేర్కోన్నారు.

దేశ రక్షణ సాంకేతికతలో ఎన్నో మార్పులు వచ్చాయని.. కాబట్టి ఏదో ఒక సైనిక విభాగంపై ఆధారపడడం సరికాదని త్రివిధ దళాలను సమన్వయ పరుచుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉన్న నేపధ్యంలో ఆ పని చేసేందుకే ఈ చీఫ్ పదవి ఉపయోగపదనుందని పేర్కొన్నారు. అయితే ఈ నియామకానికి మూడు దళాల్లోని సీనియర్ అధికారైన ఒకరిని ఎన్నుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత టర్మ్ లో రక్షణ మంత్రిగా ఉన్న దివంగత నేత మనోహర్‌ పారికర్‌ హయాంలోనే సమయంలోనే సీడీఎస్‌ నియామకానికి సంబంధించి కొన్ని సంకేతాలిచ్చినా, అది కాగితాలకే పరిమితం అయ్యింది.  ఇక ఇప్పుడు ఆ పదవిని ప్రకటించి ఆశ్చర్య పరచారు ప్రధాని మోడీ.