గుడ్ న్యూస్: 2050 నాటికి అమెరికా చైనా తరువాత ఇండియానే...!!

గుడ్ న్యూస్: 2050 నాటికి అమెరికా చైనా తరువాత ఇండియానే...!!

కరోనా కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది.  ప్రపంచంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆర్ధికంగా ఇబ్బందులు ఉండకూడదని చాలా రంగాలకు మినహాయింపులు ఇచ్చారు.  కరోనాతో సహజీవనం చేస్తూనే ప్రజలు పనులు చక్కదిద్దుకుంటున్నారు. ప్రపంచంలో ఇండియా ఆర్ధిక వ్యవస్థ ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.  2017 వ సంవత్సరంలో ఏడోస్థానంలో ఉన్న ఇండియా, ఇప్పుడు ఐదోస్థానానికి చేరింది.  అయితే, 2030 నాటికి ఇండియా నాలుగో స్థానానికి, 2050 వరకు మూడు స్థానానికి చేరుకుంటుందని లాన్సెట్ జర్నల్ పేర్కొన్నది.  అమెరికా, చైనాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా, మూడు, నాలుగు స్థానాల్లో జపాన్, జర్మనీలు ఉన్నాయి.  2050 వరకు జర్మనీ, జపాన్ లను వెనక్కి నెట్టి ఇండియా మూడో స్థానంలోకి వస్తుందని లాన్సెట్ జర్నల్ పేర్కొన్నది.  దేశ జనాభా, వయస్సు, స్థూల జాతీయోత్పత్తి తదితర విషయాలను బేరీజు చేసుకొని ఈ పరిశోధన చేసింది.