భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్‌.. తగ్గిన కేసులు..

భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్‌.. తగ్గిన కేసులు..

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ తగ్గాయి.. గత బులెటిన్‌లో దాదాపు 15 వేలకు చేరువగా కొత్త కేసులు నమోదు కాగా.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన జాతా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 13,203 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 131 మంది కరోనాతో మృతిచెందగా... ఇదే సమయంలో 13,298 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,06,67,736కు చేరగా.. ఇప్పటి వరకు 1,03,30,084 కరోనాబారిన పడి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. మృతుల సంఖ్య 1,53,470కు పెరిగింది.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,84,182 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం కరోనా బులెటిన్‌లో పేర్కొంది.. ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 16,15,504 మంది వ్యాక్సిన్‌ పూర్తి చేసినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరోవైపు ఆదివారం రోజు 5,70,246 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 19,23,37,117కు చేరినట్టు ఐసీఎంఆర్‌ ప్రకటించింది.