టాస్ గెలిచిన టీమిండియా.. ఓపెనర్‌గా గిల్

టాస్ గెలిచిన టీమిండియా.. ఓపెనర్‌గా గిల్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో కాన్‌బెర్రా వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. అయితే.. టాస్‌ గెలిచిన ఇండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్ ల్లో ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో తీవ్రత చూపించలేకపోయామని.. ఇవాళ్టి మ్యాచ్‌లో సత్తాచాటుతామని టాస్‌ గెలిచిన తర్వాత కెప్టెన్‌ కోహ్లీ పేర్కొన్నాడు. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 సిరీస్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఆసీస్‌ వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని ప్రయత్నిస్తోంది. కాగా.. భారత తుది జట్టులో భారీ మార్పులు జరిగాయి. ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ స్థానంలో శుభమన్‌ గిల్‌ వచ్చాడు. సైనీ, షమి చాహల్‌ స్థానాల్లో నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు. ఎడమ చేతి వాటం పేసర్‌ అయిన్‌ నటరాజన్‌ ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నాడు.