చైనాతో యుద్దానికి సిద్దంగా ఉండాలి: ఆర్ఎస్ఎస్ భగవత్

చైనాతో యుద్దానికి సిద్దంగా ఉండాలి: ఆర్ఎస్ఎస్ భగవత్

భారత్-చైనాల మధ్య ఉద్రిక్తలను ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ సుప్రీమ్ మోహన్ భగత్ ప్రసంగించారు. దసరా పండగ సందర్భంగా ఓ సమావేశానికి హాజరయిన మోహన్ భగత్ భారత్ చైనాతో యుద్దానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. అయితే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రతి ఏడాది దసరాను పెద్ద ఉత్సవంలో నిర్వహిస్తుంది. అందులో పాల్గొన్న మోహన్ భగత్ జాతినుద్దేశించి మాట్లాడారు. ‘భారత మిలటరీ యుద్దానికి సిద్దంగా ఉండాలి. చైనా ఎప్పుడూ రాజ్య విస్తరణ గురించే ఆలోచిస్తుంది. చైనాను మనం ఓడించేవిధంగా ఉండాల’ని అన్నారు. అంతేకాకుండా చైనాతో పోరాడేందుకు మన పొరుగు దేశాలను కలుపుకు పోవాలని చెప్పారు. దీనికి తోడు భారత్ రక్షణ శాఖ, ప్రభుత్వం, ప్రజలు ఎంతో చురుకుగా స్పందించారని, చైనాకు సరైనా సమాధానం చెప్పారని పేర్కొన్నారు. చైనా ఎన్న ఎత్తులు వేసినా వాటిని భారత ధళాలు ఎదుర్కున్నాయని, ఏ సమయంలోనైనా యుద్దం మొదలుకావచ్చని, అందుకు అన్ని సమయాల్లోనూ సన్నిద్దమయి ఉండాలని ఆయన కోరారు.