ఎయిమ్స్ పిడుగులాంటి వార్త‌..! కోవిడ్ థ‌ర్డ్ వేవ్ కూడా...?

 ఎయిమ్స్ పిడుగులాంటి వార్త‌..! కోవిడ్ థ‌ర్డ్ వేవ్ కూడా...?

భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ ఇప్పుడు క‌ల్లోలం సృష్టిస్తోంది.. పెద్ద సంఖ్య‌లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది.. ఇదే స‌మ‌యంలో.. కోవిడ్ రిక‌వ‌రీ రేటును కూడా కొట్టిపారేయ‌డానికి లేదు.. అయితే, ఫ‌స్ట్ వేవ్ లో కంటే సెకండ్ వేవ్‌లో మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది.. అయితే, కోవిడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. క‌రోనా ఇదేరీతిలో మార్పులకు గురవుతూపోతూనే.. దేశంలో మూడో విడత కల్లోలం కూడా రావొచ్చ‌ని హెచ్చ‌రించారు.. అయితే, దీనికి ఏకైక ప‌రిష్కార మార్గం మాత్రం.. వ్యాక్సినేష‌నే అని స్ప‌ష్టం చేశారు డాక్టర్ రణదీప్ గులేరియా. కోవిడ్ వ్యాక్సిన్లు చాలామందికి చేరగలిగితే దీని ప్రభావం అంతగా ఉండకపోవ‌చ్చ‌న్న ఆయ‌న‌... రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్ల వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండబోద‌ని అభిప్రాయపడ్డారు. కానీ, తగిన గడువుతో లాక్ డౌన్ విధిస్తే ఫలితం ఉండొచ్చని చెప్పుకొచ్చారు. దేశ‌వ్యాప్తంగా కనీసం 2 వారాలు లాక్‌డౌన్ అమలు చేయాలని సూచించారు.