మొదటి సెషన్ పూర్తి... కీలక వికెట్లు కోల్పోయిన భారత్  

మొదటి సెషన్ పూర్తి... కీలక వికెట్లు కోల్పోయిన భారత్  

బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా భారత్-ఆసీస్ మధ్య నేడు నాల్గవ టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. అయితే వర్షం కారణంగా రెండో రోజు ఆట పూర్తిగా సాగని విషయం తెలిసిందే. ధనతో నిన్న ఆట ముగిసే సమయానికి  62/2 తో నిలిచిన భారత్ నేడు ఆట ప్రారంభమైన కొత్త సమయానికే పుజారా(25) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మయాంక్ తో మంచి భాగసౌమ్యం ఏర్పాటు చేస్తున్న సమయంలో స్టార్క్ బౌలింగ్ లో క్యాచ్ రూపంలో రహానే పెవిలియన్ కు చేరుకున్నాడు. రహానే ఔట్ అయిన తర్వాత మయాంక్ తో కలిసి బాటింగ్ చేయడానికి పంత్ వచ్చాడు. ఇక మొదటి సెషన్ పూర్తి కావడానికి ముందు మరో వికెట్ పడకుండా వీరు జాగ్రత్తగా ఆడటంతో టీం ఇండియా 161/4 తో నిలిచింది. ప్రస్తుతం మయాంక్(38), పంత్(4) బ్యాటింగ్ కొనసాగిస్తుండగా ఆసీస్ కంటే ఇంకా 208 పరుగులు వెనకబడి ఉంది భారత జట్టు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.