చైనాకు భారత్‌ వార్నింగ్.. ఇకపై కర్రలు, రాళ్లతో కాదు..

చైనాకు భారత్‌ వార్నింగ్.. ఇకపై కర్రలు, రాళ్లతో కాదు..

మన శిబిరాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే కాల్పులకైనా వెనుకాడబోవని చైనాకు భారత్‌ స్పష్టం చేసింది. తూర్పు లడాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి ఇక కర్రలు, రాళ్లతో పోరాటాలు ఉండవని తేల్చి చెప్పింది. పాంగాంగ్‌ సరస్సు వద్ద భారత్‌కు పట్టున్న దక్షిణ రేవు నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను మొదలుపెడదామన్న డ్రాగన్‌ ప్రతిపాదనను తిరస్కరించింది. ఉద్రిక్తత నెలకొన్న అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ ప్రక్రియ సాగాల్సిందేనని స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన సైనిక కోర్‌ కమాండర్ల స్థాయి చర్చల్లో ఈ అంశాలపై భారత్‌ తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. కాగా, భారత్‌-చైనా బోర్డర్‌లో ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణ జరగడం.. భారత్ పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోవడంతో.. అప్పటి నుంచి డ్రాగన్ కంట్రీకి ధీటుగా జవాబు ఇస్తూనే ఉంది.. చైనాపై డిజిటల్ యుద్ధాన్ని ప్రకటించిన భారత్.. ఆ దేశానికి చెందిన సోషల్ మీడియా యాప్‌లను పెద్ద సంఖ్యలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.