చైనాను బీట్ చేయనున్న భారత్‌..ఇలాగే కొనసాగితే నెల రోజుల్లో మనదే అగ్రస్థానం

చైనాను బీట్ చేయనున్న భారత్‌..ఇలాగే కొనసాగితే నెల రోజుల్లో మనదే అగ్రస్థానం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజంభున ఆగడంలేదు..రోజురోజుకు వ్యాప్తిని పెంచుకుంటుంది..ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ దాదాపుగా 45లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి..

దేశంలో కరోనా కేసులు జూన్, జులైలో పీక్ స్టేజ్ కు చేరుతాయని,చైనా కేసులను దాటుతుందని అనేక అంతర్జాతీయ,జాతీయసంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి..భారత్‌పై కరోనా మరింత ఎక్కువ ప్రేమ ఉన్నట్లుంది.. అంచనాలకు భిన్నంగా ఉంది ప్రస్తుత పరిస్థితి... నెల రోజుల ముందే మనం చైనాను దాటేయడానికి సిద్ధంగా ఉన్నాం... ఏ క్షణమైనా కరోనా కేసుల్లో భారత్ చైనాను మించిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి... ఇప్పటికే కొత్త కేసుల్లో టాప్ ఫైవ్ దేశాల్లో ఉన్న భారత్.. మొత్తం కేసుల విషయంలో కూడా చైనాను వెనక్కినెట్టి.. టాప్ టెన్ లో చేరడానికి రెడీగా ఉంది.

కొత్త కేసుల విషయంలో భారత్ ప్రపంచంలోనే టాప్-5లో దేశాల్లో ఉంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 21,712, బ్రెజిల్ లో 11,555, రష్యాలో 10,028, పెరూలో 4,247 కొత్త కేసులు నమోదుకాగా.. 3722 కొత్త కేసులతో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. మే 2 నుంచి కొనసాగుతోన్న పరిస్థితిని బట్టి మనం మరో స్థానానికి ఎగబాకినా ఆశ్యర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు....

చైనాలో కరోనా కేసులు 83 వేలకు చేరువలో ఉంటే... మన దేశంలో కేసుల సంఖ్య 82 వేలకు దగ్గరగా ఉంది... ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 81వేల 970 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో చైనా కేసులను క్రాస్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి... కరోనా వైరస్ చైనాలోనే పుట్టడంతో ప్రారంభంలో కరోనా కేసులు తీవ్రత ఎక్కువగా ఉండేది.   డిసెంబర్ నుంచి మార్చి వరకు కరోనాకేసులు వేలల్లో పెరిగాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. మనదేశంలో మాత్రం ఏప్రిల్, మే నెల్లో కేసులు వేలల్లో పెరిగాయి.  రెండు మూడు రోజుల వ్యవధిలోనే పది వేల కేసులు నమోదయ్యాయి.

గతేడాది నవంబర్‌లోనే కరోనా వైరస్ వుహన్‌లో విజృంభించినా...దానిని గుర్తించి అధికారికంగా ప్రకటించాడనికి చైనా చాలా సమయం తీసుకుంది... 2019, డిసెంబర్ 31న తమ దేశంలో తొలి కేసుల నమోదైనట్టు చైనా అధికారికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది. కచ్చితంగా నెల రోజుల తర్వాత  మన దేశంలో తొలి కరోనా కేసు రిపోర్టయ్యింది. వుహాన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్ధులకు కరోనా ఉన్నట్లు కేరళ ప్రభుత్వం జనవరి 30న ప్రకటించింది. చైనాలో మొదటి మరణం జనవరి 9న నమోదైతే... మార్చి 11న మనదేశంలో కరోనాతో తొలి పేషెంట్ చనిపోయారు... ఇప్పటి వరకు చైనాలో 82వేల 933 కేసులు నమోదైతే.. మన దేశంలో ఈ రోజు వరకు  81,970 కేసులు నమోదయ్యాయి. మరో 963 కేసులు వస్తే...భారత్ చైనాను మించిపోతుంది...

ఇప్పటి వరకు చైనాలో 4వేల 633 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతే... మన దేశంలో 2వేల 649 మంది చనిపోయారు. చైనాలో ప్రతి పది లక్షల మందిలో 58మందికి కరోనా వస్తే.. అదే మనదేశంలో 60మందికి సోకింది. మరణాల్లో మాత్రం చైనానే ముందుంది.  చైనాలో పది లక్షల మందిలో ముగ్గురు కరోనాతో చనిపోతే...మనదేశంలో ఇద్దరు మాత్రమే ప్రాణాలుకోల్పోతున్నారు...దేశంలో కరోనా విజృంభన ఇలాగే వ్యాప్తి విస్తరిస్తే,భారత్‌లో వచ్చే నెల రోజుల్లో కేసులల్లో ప్రపంచంలో అగ్రస్థానంలోకి వెళ్లి  ఆశ్యర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు.