11 ఏళ్ల తర్వాత భారత్‌ బోణీ..

11 ఏళ్ల తర్వాత భారత్‌ బోణీ..

ఆస్టేలియాలో భారత్‌ జట్టు చరిత్ర సృష్టించింది. అడిలైడ్‌లో సూపర్‌ విక్టరీతో దాదాపు 11 ఏళ్ల తర్వాత ఆ దేశంలో తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. చివరిసారిగా 2008లో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ గెలుపొందింది. ఇక.. ఆస్ట్రేలియాతో ఆడిన 45 టెస్టుల్లో భారత్‌కు ఇది 6వ విజయం. గత రెండు ఆస్ట్రేలియా సిరీస్‌లో ఒక్క టెస్టు మ్యాచ్‌ను కూడా గెలవలేకపోయిన భారత్‌ జట్టు.. ఈసారి విజయంతో సిరీస్‌ను ఆరంభించింది. ఆసీస్ గడ్డపై సిరీస్ తొలి టెస్టులో గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. అడిలైడ్‌లో భారత్‌కు ఇది రెండో విజయం.