ఇండియా కరోనా అప్డేట్...

ఇండియా కరోనా అప్డేట్...

ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.  తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 12,689 కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,89,527కు చేరింది.  ఇందులో 1,03,59,305  మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,76,498 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 137 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1,53,724 కు చేరింది.  ఇక ఇదిలా ఇండియాలో కరోనా రికవరీ రేటు 96.9 శాతంగా ఉంటె, ఇక మరణాల రేటు 1.4 శాతానికి పడిపోయింది.