ఇండియా కరోనా అప్డేట్: రికార్డ్ స్థాయిలో...
ఇండియాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య లక్షకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా ఇండియాలో 1,26,789 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది. ఇందులో 1,18,51,393 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,10,319 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 685 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,66,862కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 59,258 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)