రేపటి నుంచి విదేశాలకు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్
ఇండియాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 4,54,049 మందికి వ్యాక్సిన్ అందించారు. ఇక ఈరోజు ఒక్కరోజే 2,23,669 మందికి వ్యాక్సిన్ వేసారు. దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తూనే, విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది. భూటాన్, మాల్దీవులు, బాంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీసెల్స్ దేశాలకు వ్యాక్సిన్ ను అందించబోతున్నది. జనవరి 20 వ తేదీ నుంచి వ్యాక్సిన్ ను అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ముందుగా రేపు భూటాన్ దేశానికీ వ్యాక్సిన్ అందించబోతున్నారు. ఇక శ్రీలంక, ఆఫ్గనిస్తాన్, మారిషస్ దేశాలకు సంబంధించి రెగ్యులేటరీ క్లియరెన్స్ రావాల్సి ఉన్నది. ఈ క్లియరెన్స్ వస్తే ఆయా దేశాలకు కూడా వ్యాక్సిన్ ను ఎగుమతి చేస్తామని భారత విదేశాంగ శాఖ తెలియజేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)