కోవిడ్ కేసులు పైపైకి.. భార‌త్‌లో కొత్త రికార్డు

 కోవిడ్ కేసులు పైపైకి.. భార‌త్‌లో కొత్త రికార్డు

భార‌త్‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది.. తొలి వేవ్ భ‌య‌పెడితే.. సెకండ్ వేవ్‌లో భ‌యం త‌గ్గినా.. కేసులు మాత్రం డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి... పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి.. ఇప్ప‌టికే రెండ్ ల‌క్ష‌ల మార్క్‌ను దాటేసిన రోజువారీ కేసులు.. ఇప్పుడు మూడుల ల‌క్ష‌ల వైపు ప‌రుగులు తీస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 2,73,810 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. 1,619 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు.. ఇదే స‌మ‌యంలో 1,44,178 మంది క‌రోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నార‌ని కేంద్రం పేర్కొంది.. దీంతో.. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,50,61,919కు చేరుకోగా.. యాక్టివ్ కేసులు 19,29,329గా ఉన్నాయి.. ఇక, ఇప్ప‌టి వ‌ర‌కు 1,29,53,821 మంది రిక‌వ‌రీ అయితే.. 1,78,769 మంది ప్రాణాలు వ‌దిలారు.. మ‌రోవైపు.. ఇప్ప‌టి వ‌ర‌కు 12,38,52,566 మంది వ్యాక్సినేష‌న్ పూర్తి చేసిన‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది.