ఇండియాలో తక్కువగానే కరోనా కేసులు.. ఎన్నంటే !

ఇండియాలో తక్కువగానే కరోనా కేసులు.. ఎన్నంటే !

భారత్‌లో కరోనా కేసుల విజృంభణ నెమ్మదిగా తగ్గుతోంది. రోజు వారీ కేసులు కనీసం 50 వేలకు తగ్గకుండా నమోదు అవుతోండగా ఇప్పుడు ఆ సంఖ్య తగ్గంది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 45,149 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 480 మంది మృతిచెందారు.. ఇక, గడచిన 24 గంటల్లో 14,437మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,09,960కు చేరుకోగా.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,53,717 యాక్టివ్ కేసులు ఉన్నాయి..

71,37,229 మంది రికవరీ అయ్యారు.. ఇప్పటి వరకు 1,19,014 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. అయితే, భారత్‌లో కరోనా రికవరీ రేటు పెరిగింది.. రికవరీ రేటు 90 శాతానికి పెరిగినట్టు కేంద్రం చెబుతోంది. యాక్టివ్‌ కేసులు 8.71  శాతంగా ఉండగా.. కరోనా మరణాల రేటు 1.51 శాతానికి తగ్గిపోయింది.. మరోవైపు.. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 9,39,309 కాగా.. ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం టెస్ట్ ల సంఖ్య 10,34,62,778కు పెరిగింది.