భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?
మన దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా దేశంలో 10,584 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,10,16,434 కు చేరింది. ఇందులో 1,07,12,665 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,47,306 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 78 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 1,56,463 కు చేరింది. ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,17,45,552 మందికి వ్యాక్సిన్‌ను ఇవ్వడం విశేషం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)