6 దేశాలకు భారత్‌ వ్యాక్సిన్లు.. నేటి నుంచి సరఫరా..

6 దేశాలకు భారత్‌ వ్యాక్సిన్లు.. నేటి నుంచి సరఫరా..

కరోనా వైరస్‌కు చెక్‌ పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది.. ఇప్పటికే దేశ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది.. ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది భారత్‌.. ఇప్పటికే కుదిరిన ఒప్పందాలను అనుగుణంగా ఆరు దేశాలకు వ్యాక్సిన్లను పంపనుంది.. ఈ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా పొరుగు దేశాలు, భాగస్వామ్య దేశాలకు ‘మేడిన్​ ఇండియా’ వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నట్టు తెలిపింది. భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్​, సీషెల్సకు ఇవాళ్టి నుంచి వ్యాక్సిన్‌ సరఫరా చేయనున్నాఉ.. ఇక, శ్రీలంక, ఆఫ్గనిస్థాన్, మారిషస్‌కు రెగ్యులేటరీ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. వారికి అనుమతి లభిస్తే.. ఆ దేశాలకు సైతం వ్యాక్సిన్‌ పంపనుంది భారత్. ఆయా దేశాశాలకు దశల వారీగా వ్యాక్సిన్లు సరఫరా చేయనున్నారు..