భారత్ ఆల్ ఔట్... 33 పరుగుల లీడ్ లో ఆసీస్

భారత్ ఆల్ ఔట్... 33 పరుగుల లీడ్ లో ఆసీస్

బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా భారత్-ఆసీస్ మధ్య నేడు నాల్గవ టెస్ట్ లో భారత మొదటి ఇన్నింగ్స్ పూర్తయింది. నిన్న వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి 62/2 తో నిలిచిన భారత్ నేడు ఆట ప్రారంభమైన కొత్త సమయానికే పుజారా(25) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్టార్క్ బౌలింగ్ లో క్యాచ్ రూపంలో రహానే పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక రెండో సెషన్ ప్రారంభమైన తర్వాత రెండో బంతికే మయాంక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత పంత్ కూడా అదే దారిలో పెవిలియన్ కు చేరుకున్నాడు. దాంతో 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టు సుందర్(62), శార్దుల్(67) అర్ధశతకాలతో రాణించడంతో 300 పరుగులకు దాటింది. కానీ ఆ తర్వాత శార్దుల్ ఔట్ అయిన కాసేపటికే గాయం నుండి కోలుకొని బ్యాటింగ్ కు వచ్చిన సైని, సుందర్ వెంటవెంటనే పెవిలియన్ కు చేరుకున్నారు. ఆ తర్వాత చివరి వికెట్ గా సిరాజ్(13) పరుగులు చేసి ఔట్ కావడంతో 336 పరుగుల వద్ద భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో టీం ఇండియా కంటే ఆసీస్ ఇంకా 33 పరుగుల ఆధిక్యంలో ఉంది.