చెలరేగిన విండీస్ బౌలర్లు.. కష్టాల్లో భారత్..

చెలరేగిన విండీస్ బౌలర్లు.. కష్టాల్లో భారత్..

ఆంటిగ్వా వేదికగా భారత్-వెస్టిండీస్‌ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో విండీస్‌ బౌలర్లు చెలరేగిపోయారు. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ టీమిండియాకు చుక్కులు చూపించారు. దీంతో టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్‌కు క్యూ కట్టింది. ఆదిలోనే టీమిండియాకు కోలుకోలేని దెబ్బ పడింది. మూడు వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు సాధించింది విండీస్. తొలుత కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో ఐదో ఓవర్‌లో మయాంక్‌ అగర్వాల్‌ 5 పరుగులకే వెనుదిరుగగా.. పుజారా 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర కీపర్‌ షైహోప్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యారు. ఆ తర్వాత గాబ్రియల్‌ వేసిన బంతికి విరాట్‌కోహ్లీ 9 పరుగుల దగ్గర పెవిలియన్ చేరాడు. 24 ఓవర్లు ముగిసే సరికి (లంచ్ సమయానికి) టీమిండియా 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.