కొత్త రూల్స్‌.. ఆ లావాదేవీలపై పన్నుపోటు..!

కొత్త రూల్స్‌.. ఆ లావాదేవీలపై పన్నుపోటు..!

కరోనా సమయంలో అన్ని రకాల లావాదేవీలపై ఛార్జీలు ఎత్తివేసిన బ్యాంకులు.. ఆ తర్వాత వరుసగా వడ్డింపులు మొదలుపెట్టాయి.. దీనికి ప్రభుత్వరంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అనే తేడాలేకుండా పన్నుపోటు పడుతోంది.. ఇక, కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తెచ్చింది.. అవి అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.. నయా నిబంధనల ప్రకారం.. మనీ ట్రాన్స్‌ఫర్‌పై పన్ను బాదుడు మొదలుకానుంది. ఇది, కేవలం.. విదేశీ మనీ ట్రాన్స్‌ఫర్‌పై ప్రభావం చూపనుంది. అంటే.. భారత్‌ నుంచి విదేశాల్లో ఉన్న వారికి డబ్బులు పంపే వారిపై ఈ కొత్త రూల్స్‌ ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయి.

ఆర్బీఐ లిబరలైజర్డ్ రెమిటెన్స్ స్కీమ్ ప్రకారం.. ప్రస్తుతం భారత్‌ నుంచి విదేశాల్లో ఉన్నవారికి ఎవరికైనా ప్రతి ఏడాది 2,50,000 డాలర్లను పంపే వెసులుబాటు ఉంది.. అయితే, ఫైనాన్స్ యాక్ట్ 2020 ప్రకారం ఈ లావాదేవీలపై 5 శాతం పన్ను వడ్డించనున్నారు. టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్‌సోర్స్) కట్ పేరుతో 5 శాతం పన్ను వసూలు చేస్తారు. ఫారిన్ టూర్ ప్యాకేజీలకు కూడా ఈ టీసీఎస్ వర్తింపజేస్తారు. ఇక, ఎవ్వరికీ ఎలాంటి పన్ను మినహాంపు ఉండబోదు అంటోంది కేంద్రం. అయితే, అంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో రెమిటెన్స్‌ విలువ రూ.7 లక్షలు దాటితేనే ఇలా పన్ను ఉంటుంది. ఇక, పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు సమర్పించనివారికైతే 10 శాతం టీసీఎస్ విధించేందుకు సిద్ధమవుతోంది సర్కార్. ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఆ సొమ్మును విదేశాల్లో చదువుతున్న వారి పిల్లలకు పంపితే టీసీఎస్‌పై 0.5 శాతం రాయితీ లభించనుంది.