రామతీర్థం ఆలయం కోసం సిద్దమవుతున్న విగ్రహాలు
రామతీర్థం ఆలయం కోసం తిరుపతిలో విగ్రహాలు సిద్దమవుతున్నాయి. ధ్వంసమైన రాముడి విగ్రహం తో పాటు సీతాదేవి, లక్ష్మణుల విగ్రహాలు తయారు చేస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ కి చెందిన సంప్రదాయ ఆలయ నిర్మాణం శిల్ప సంస్థలో విగ్రహాల తయారీ జరుగుతోంది. కంచి నుంచి రాయిని తెప్పించి విగ్రహాలను చెక్కుతున్న శిల్పులు..ఇప్పటికే వీటి పనులు ప్రారంభమయ్యాయి. పదిరోజుల్లో మూడు విగ్రహాలను అందించనున్నారు శిల్పులు. కాగా...విగ్రహాల ధ్వంసంపై ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రామతీర్థం ఘటనతో రాజకీయ పార్టీలతో రణరంగంగా మారింది. మూడు పార్టీల నేతలు వరుసగా రామతీర్థంలో పర్యటించడంతో... ఉద్రిక్తతంగా మారిన విషయం తెలిసిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)