'ఇది మ‌హాభార‌తం కాదు'.. ఆర్జీవి ఆడియో పోస్టర్

'ఇది మ‌హాభార‌తం కాదు'.. ఆర్జీవి ఆడియో పోస్టర్

'ఇది మహాభారతం కాదు' అనే టైటిల్ తో వెబ్ సిరీస్ ప్రకటించారు వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. దీనికి సంబంధించిన ఆడియో పోస్టర్ ను వర్మ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. దీనికి రచన సిరాశ్రీ కాగా, ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఓవరాల్ పర్యవేక్షణ వర్మ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహాభారతంలోని పాత్రలను ప్రస్తావిస్తూ.. తన వాయిస్ ఓవర్‌తో రాంగోపాల్ వర్మ విడుదల చేసిన ఆడియో పోస్టర్ వీడియో ఆసక్తికరంగా ఉండటం గమనార్హం. మహాభారతంలో కనిపించే పాత్రలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తారసపడుతుంటాయని, తెలంగాణలోని ఓ పట్టణంలోనూ అలాంటి వ్యక్తులు ఉన్నారని, దీని ఆధారంగా తాము వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నామని వర్మ ఆ ఆడియో పోస్టర్ లో వెల్లడించారు.