మరో కొత్త చైనా వైరస్‌.. దోమల నుంచి వ్యాప్తి...? ఐసీఎంఆర్ వార్నింగ్..

మరో కొత్త చైనా వైరస్‌.. దోమల నుంచి వ్యాప్తి...? ఐసీఎంఆర్ వార్నింగ్..

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది.. రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తుంది. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. ఇక, ప్రభుత్వాలు సైతం చేతులు ఎత్తేయడంతో.. ప్రజలు కూడా అలవాడుపడిపోయారు. అయితే, ఇదే సమయంలో డ్రాగన్ కంట్రీలో రోజుకో కొత్త వైరస్‌ పుట్టికొస్తుంది.. తాజాగా, మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది.. ఆ వైరస్‌ ముప్పు మనకు కూడా పొంచి ఉందని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) వార్నింగ్‌ ఇచ్చింది. ఆ వైరస్‌ పేరే ‘క్యాట్‌ క్యూ వైరస్‌’(సీక్యూవీ)... ఆర్ర్దోపోడ్‌ వర్గానికి చెందిన జీవులను వాహకాలుగా వాడుకొని ఈ వైరస్‌ వ్యాపిస్తుందని చెబుతున్నారు. 

ముఖ్యంగా క్యాట్ క్యూ వైరస్.. క్యూలెక్స్‌ జాతి దోమలు, పందులను ఆవాసాలుగా మార్చుకుంటుందని ఇప్పటికే చైనా, తైవాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలినట్టు చెబుతోంది ఐసీఎంఆర్‌. ఇక భారత్ విషయానికొస్తే పందులు క్యాట్‌ క్యూ వైర్‌స్‌కు ప్రాథమిక వాహకాలుగా పనిచేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏజిప్టీ, క్యూలెక్స్‌ క్విన్‌క్వేఫాషియేటస్‌, క్యూలెక్స్‌ ట్రైటేనియోరైన్‌కస్‌ జాతుల దోమల ద్వారా కూడా ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించొచ్చని భారత వైద్య పరిశోధనా మండలి పరిశోధనలో తేలింది. దేశవ్యాప్తంగా సేకరించిన 883 సీరం శాంపిళ్లను.. పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) శాస్త్రవేత్తలు పరీక్షించారు.. అయితే, రెండు నమూనాల్లో క్యాట్‌ క్యూ వైర్‌సను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను గుర్తించారు. కానీ, ఆ శాంపిళ్లలో నేరుగా వైరస్‌ జాడను తాము గుర్తించలేదని ఎన్‌ఐవీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కొత్త వైరస్‌ బారిన ఎంతమంది పడ్డారో తెలియాలంటే మరిన్ని శాంపిల్స్‌ను టెస్ట్‌ చేయాల్సిందే అంటున్నారు. మనుషులతో పాటు పందులు, ఇతర జంతువుల శాంపిళ్లను కూడా సేకరించే పనిలో పడ్డారు. కానీ, దోమలను ఆవాసాలుగా మా ర్చుకొని సంఖ్యను పెంచుకునే సామర్థ్యం క్యాట్‌ క్యూ వైర్‌స్‌కు ఉండటం మాత్రం ఆందోళకలిగించే విషయమే అంటోంది ఐసీఎంఆర్‌.. ఈ కొత్త వైరస్‌తో మలేరియా, డెంగీ, హంటావైర్‌సతో తలెత్తే రుగ్మతలు, మెనింజైటిస్‌, పిడియాట్రిక్‌ ఎన్‌సెఫలైటిస్‌ దారితీస్తాయిని వార్నింగ్ ఇస్తోంది ఐసీఎంఆర్. అసలే, కరోనాతో అల్లాడిపోతున్న సమయంలో.. ఈ వైరస్ ఎటాక్ చేస్తే మాత్రం.. మరింత స్పీడ్‌గా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.