మారిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వేదిక...
ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ - ICC నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 18-22 మధ్య జరగబోతోంది. ర్యాంకులు ఆధారంగా ఫైనల్‌కు ఎంపికైన భారత్-న్యూజిలాండ్‌ల మధ్య ఈ మ్యాచ్ జరగబోతోంది. వరల్డ్ టెస్ట్ చాపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్‌లో జరుగుతుందని తొలుత ప్రకటించారు నిర్వాహకులు. అయితే... అది సౌథాంప్టన్‌లో జరగబోతోందని స్పష్టత ఇచ్చారు BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. కరోనా భయాల వల్ల బయో బబుల్‌లో మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. అయితే... లార్డ్స్‌లో దీనికి అవసరమైన వసతులు లేవు. దీంతో ఫైవ్ స్టార్ సదుపాయాలు గల సౌథాంప్టన్‌కు వేదికను మార్చింది ICC. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు తాను కూడా వెళ్తానన్నారు గంగూలీ. అక్కడ న్యూజిలాండ్‌ను భారత్ ఓడిస్తుందన్న నమ్మకం తనకుందన్నారాయన. అయితే, భారత్ కంటే కివీస్ జట్టు అక్కడికి చేరుకుని, ఇంగ్లాండ్‌తో ఆడబోతోందని తెలిపారు. లార్డ్స్‌తో పోలిస్తే సౌథాంప్టన్ మందకొడి పిచ్ అన్నారు గంగూలీ. అది స్పిన్‌కు అనుకూలిస్తుందని వివరించారు.ఆస్ట్రేలియా టూర్‌తో పాటు సొంత గడ్డపై ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు గంగూలీ. టీమిండియా కెప్టెన్ కోహ్లీతో పాటు కోచ్, సహాయ సిబ్బంది సహా ప్రతి ఒక్కర్నీ ప్రశంసించాల్సిందే అన్నారు. ద్రవిడ్ గురించి ప్రస్తావిస్తూ... కుర్రాళ్లను తీర్చిదిద్దడంతో తెర వెనుక శ్రమించాడని తెలిపారు గంగూలీ.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)