శ్రీలంక పై ఐసీసీ సెటైర్‌...

శ్రీలంక పై ఐసీసీ సెటైర్‌...

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 12మంది ఆటగాళ్లతో బరిలోకి దిగింది. ఫలితంగా ఐసీసీ రంగంలోకి దిగింది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని బదులిచ్చింది. గాలె వేదికగా జరిగిన ఈ టెస్టుకు అనుకోని అతిథి వచ్చాడు. ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ఉడుము తరహాలో ఉండే ఓ జంతువు బౌండరీ సరిహద్దు వద్దకు వచ్చి నిలబడింది. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్నట్టుగా అనిపించింది. టీవీ తెరలపై కనిపించిన ఈ దృశ్యాన్ని నెటిజన్లు ట్విటర్లో వైరల్‌ చేశారు. దీనిపై ఐసీసీ వ్యంగ్యాస్త్రం విసిరింది. లంక అదనపు ఫీల్డర్‌ను మోహరించిందని సెటైర్‌ వేసింది. అలాగే పరిస్థితిని పర్యవేక్షిస్తాం అంటూ ట్వీట్‌ చేసింది. మరోవైపు శ్రీలంకపై ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో రెండో టెస్టులో గెలుపొందింది.