ఐసీసీ ర్యాంకింగ్స్ ... ఎవరెక్కడంటే..?

ఐసీసీ ర్యాంకింగ్స్ ... ఎవరెక్కడంటే..?

తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ప్రకటించింది. పాకిస్థాన్ తో జరిగిన చివరి టెస్ట్ లో డబుల్ సెంచరీ సాధించిన జాక్‌ క్రాలీ తన కెరియర్ లోనే అత్యుత్తమంగా 28 వ స్థానానికి చేరుకున్నాడు. ఇందులో 911 పాయింట్లతో ఆస్ట్రేలియా బాట్స్మెన్ స్టీవ్‌ స్మిత్ మొదటి స్థానం లో నిలువగా 886 పాయింట్లతో విరాట్ రెండు, మార్నస్‌ లబ్‌షేన్‌ 827 పాయింట్లతో మూడో స్థానం లో ఉన్నారు. టాప్-10 లో చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానె స్థానం దక్కించుకున్నారు. ఇక బౌలింగ్ లో ప్యాట్‌ కమిన్స్‌ టాప్ లో ఉండగా భారత బౌలర్లలో అత్యుత్తమంగా జస్ప్రీత్ బుమ్రా 9 వ స్థానం లో ఉన్నాడు. 

వన్డే క్రికెట్ లో 871‌, 855 పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు. ఆ తర్వాత మూడో స్థానంలో బాబర్‌ ఆజమ్‌ నిలిచాడు. బౌలింగ్ విభాగం లో ట్రెంట్ బౌల్ట్ ఫస్ట్, బుమ్రా సెకండ్ ప్లేస్ కైవసం చేసుకున్నారు. ఇక టీ20లో మాత్రం భారత ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ రెండో ర్యాంకులో ఉన్నాడు. బాబర్‌ ఆజమ్‌ టాప్‌ ర్యాంకును, ఆరోన్‌ ఫించ్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. బౌలింగ్ లో మాత్రం టాప్-10 లో ఒక్క భారత ఆటగాడు కూడా లేడు. అత్యుత్తమంగా బుమ్రా 13 వ స్థానానికి పరిమితమయ్యాడు.