ఐసీసీ ''బ్యాక్ టు క్రికెట్'' మార్గదర్శకాలు...
కరోనా లాక్ డౌన్ సడలించడం ప్రారంభించినందున క్రికెట్ కార్యకలాపాలను పునః ప్రారంభించడంలో సభ్యులకు సహాయపడటానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్‌ను సురక్షితంగా తిరిగి ప్రారంభించడానికి మార్గదర్శకాలను సిఫారసు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ పునః ప్రారంభం కోసం ఐసీసీ తన తాజా మార్గదర్శకాలలో చీఫ్ మెడికల్ ఆఫీసర్లు మరియు 14 రోజుల ఐసోలేషన్ శిక్షణా శిబిరాలను నియమించాలని సిఫారసు చేసింది. అందులో ప్రధానంగా మొత్తం క్రికెట్ సమాజ శ్రేయస్సు ముఖ్యం అని తెలిపింది. అలాగే మ్యాచ్ ప్రారంభానికి ముందు అక్కడి స్థానిక ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని సూచించింది. అలాగే ప్రతి మ్యాచ్‌కు ముందు ప్రీ ఐసోలేషన్ క్యాంపు నిర్వహించాలని, అక్కడ ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పరీక్షించాలని తెలిపింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)