సిఏ పరీక్షలు మళ్ళీ వాయిదా... పరిస్థితులను బట్టి... 

సిఏ పరీక్షలు మళ్ళీ వాయిదా... పరిస్థితులను బట్టి... 

కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తున్నది.  దీంతో ఇప్పటికే 10వ తరగతి పరీక్షలను రద్దు చేసారు. అన్ని రకాల ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి.  ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ పరీక్షలను వాయిదా వేశారు.  ఈ పరీక్షలు వాయిదా పడటం ఇది మూడోసారి.  షెడ్యూల్ ప్రకారం మే 2 నుంచి మే 18 వరకు పరీక్షలు జరగాల్సి ఉన్నది.  

కానీ, కరోనా మహమ్మారి కారణంగా జూన్ 19 నుంచి జులై 4 వరకు నిర్వహిస్తామని చెప్పారు.  కానీ, కరోనా తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో అప్పుడు కూడా వాయిదా వేశారు.  జులై 29 నుంచి ఆగష్టు 16 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని జులై 4 వ తేదీన  ఇన్స్టిట్యూట్ అఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా  ప్రకటించింది.  అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నది.  ఈ సమయంలో  జులై 29 నుంచి నుంచి కూడా పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని, పరిస్థితులను బట్టి నవంబర్ నెలలో పరీక్షలు నిర్వహిస్తామని ఐసిఏఐ ప్రకటించింది.