కోహ్లీ, బాబర్ ను చూస్తే సచిన్ గుర్తొస్తాడు...

కోహ్లీ, బాబర్ ను చూస్తే సచిన్ గుర్తొస్తాడు...

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఉన్న పెద్ద చర్చ పోలికలు. ఏ ఆటగాడైన అద్భుతంగా రాణిస్తే ఓ మాజీ ఆటగాడితో పోల్చడం మనం చూస్తూనే ఉన్నాము. అలా ఇంతకముందు భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని పోల్చేవారు. కానీ గత కొంతకాలంగా పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ ను కోహ్లీతో పోలుస్తున్నారు. అయితే అలా పోల్చడం తనకు ఇష్టం లేదు అని బాబర్ చెప్పాడు. అయితే ఇప్పుడు మరో పోలికను తెరపైకి తెచ్చాడు వెస్టిండీస్ మాజీ పేసర్ ఇయాన్ బిషప్. ఓ ఆటగాడితో లైవ్ చాట్ చేస్తూ ఈ విషయం పై మాట్లాడాడు. అతను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మరియు బాబర్ ఆజమ్‌ లు ముగ్గురు ఒకే రకం ఆటగాళ్లు అని చెప్పాడు. మొదటిసారి ఈ ముగ్గురు కుడిచేతి వాటం బ్యాట్‌మెన్‌లను కలిపి పోల్చారు. సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ చేయడం అత్యంత కష్టతరమైన పని, ఎందుకంటే అతను స్ట్రైయిట్ గా షాట్స్ ఆడేవాడు. ఇప్పుడు , కోహ్లీ మరియు బాబర్ కూడా అలాగే ఆడుతున్నారు అని బిషప్ చెప్పాడు. అయితే  ప్రస్తుతం కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం లో ఉండగా బాబర్ టీ 20 లలో మొదటి స్థానంలో ఉన్నాడు.