కేదార్‌నాథ్‌లో అరుదైన సంఘటన.. Mi-17ని లేపుకెళ్ళిన చినూక్‌ హెలికాప్టర్‌

   కేదార్‌నాథ్‌లో అరుదైన సంఘటన.. Mi-17ని లేపుకెళ్ళిన చినూక్‌ హెలికాప్టర్‌

 కేదార్‌నాథ్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుందిది. ప్రమాదానికి గురైన Mi-17 హెలికాప్టర్‌ను... చినూక్‌ హెలికాప్టర్‌ సాయంతో తరలించింది ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌. ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్సుకు చెందిన Mi-17 హెలికాప్టర్‌... కేదారనాథ్‌ ఆలయానికి వెనుక గల హెలిపాడ్‌పై దిగే క్రమంలో ఓ ఇనుప నిర్మాణాన్ని ఢీకొట్టింది. దీంతో Mi-17 హెలికాప్టర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కాగా, పూర్తిగా దెబ్బతిన్న Mi-17 హెలికాప్టర్ని చినూక్‌ హెలికాప్టర్‌ సాయంతో తరలించింది ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌. యుద్ధ భూమిలో ఉపయోగించే భారీ హెలికాప్టర్లైన Mi-17, చినూక్‌ల మధ్య పోటీ ఉంది. రష్యా తయారు చేస్తున్న Mi-17 హెలికాప్టర్లను భారత్‌ వినియోగిస్తూ వస్తోంది. అయితే, ఇటీవల అమెరికా నుంచి కొన్న చినూక్‌ హెలికాప్టర్లను ఇప్పుడు రంగంలోకి దించింది. బలగాలతో పాటు యుద్ధ ట్యాంకు లాంటి కార్గోను తరలించడానికి ఈ భారీ హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.