ఈ నెలాఖరుకు ఇండియా రానున్న రఫేల్ యుద్ధ విమానాలు... 

ఈ నెలాఖరుకు ఇండియా రానున్న రఫేల్ యుద్ధ విమానాలు... 

భారత వైమానిక రంగాన్ని  ఆధునీకరిస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగానే ఇండియా ఫ్రాన్స్ నుంచి 36  రఫేల్  యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది.  అయితే, మొదటిదశ విమానాలు ఈ ఏడాది మార్చి నెలలోనే ఇండియాకు రావాల్సి ఉన్నా, ఫ్రాన్స్ లో కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యం అయ్యింది.  మార్చి నెలలో ఇండియాకు అందజేయాల్సిన తొలిదశకు సంబంధించిన 5 రఫేల్ యుద్ధ విమానాలను ఈ నెలాఖరుకు అందజేయబోతున్నది ఫ్రాన్స్.  ఈ నెలాఖరుకు ఈ  యుద్ధ విమానాలు భారత్ కు చేరుకుంటాయి.  జులై 29 వ తేదీన అంబాలా లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ఈ విమానాలను అందజేస్తారు.  అంబాలా ఎయిర్ ఫోర్స్ నుంచి ఈ విమానాలను వచ్చే నెలలో  లడఖ్ లోని ఎయిర్ బేస్ కు తరలిస్తారని సమాచారం.