అంబాలా ఎయిర్ బేస్ లో సగర్వంగా రాఫెల్... 

అంబాలా ఎయిర్ బేస్ లో సగర్వంగా రాఫెల్... 

ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను ఈరోజు గోల్డెన్ యురోస్ లో 17 వ స్క్వాడ్రన్ లో భాగం అయ్యాయి.  ఫ్రాన్స్ నుంచి తొలివిడతగా ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు జులై 29 వ తేదీన ఇండియాలోని అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి.  కాగా, ఈరోజు వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అధికారికంగా అందజేస్తున్నారు.  ఈ కార్యక్రమం అంబాలా ఎయిర్ బేస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ వేడుకకు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటుగా ఫ్రాన్స్ రక్షణ శాఖా మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ హాజరయ్యారు.  

రాఫెల్ యుద్ధ విమానాలకు మొదట సర్వధర్మ పూజను నిర్వహించారు.  అనంతరం ఎయిర్ బేస్ లో రాఫెల్ యుద్ధ విమానాలు విన్యాసాలు చేశాయి.  రాఫెల్ యుద్ధ విమానాలతో పాటుగా సారంగ్ హెలికాఫ్టర్లు కూడా యుద్దవిన్యాసాలు చేశాయి. అనంతరం రాఫెల్ యుద్ధ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు రక్షణ శాఖ అందజేసింది.