రన్ వే పై అదుపు తప్పిన ఐఏఎఫ్‌ విమానం

రన్ వే పై అదుపు తప్పిన ఐఏఎఫ్‌ విమానం

భారత వైమానిక దళానికి చెందిన ఓ రవాణా విమానం రన్ పై నుంచి అదుపుతప్పి నేల మీదికి జారింది. ముంబయి చత్రపతి ఇంటర్నేషన్ విమానాశ్రయం నుంచి బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో వెళ్తున్న సిబ్బంది అంతా సురక్షితంగానే ఉన్నట్టు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.ప్రధాన రన్‌వే నుంచి విమానం పక్కకు జారిపోవడంతో మిగతా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల కొన్ని విమానాలు ఆలస్యంగా బయలు దేరినట్లు వెల్లడించారు.