పార్టీ ఆదేశిస్తే చీరాల నుంచి పోటీ..

పార్టీ ఆదేశిస్తే చీరాల నుంచి పోటీ..

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చీరాల పాలిటిక్స్ హాట్ టాఫిక్ అయ్యాయి... సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరడంలో ఇక ఇప్పటి వరకు టీడీపీ నుంచి ఆ స్థానం ఆశిస్తున్న నేతలు రంగ ప్రవేశం చేస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే తాను చీరాలలో పోటీకి సిద్ధమని ప్రకటించారు ఎమ్మెల్సీ కరుణం బలరాం... ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... చీరాల టికెట్ బీసీలకు ఇవ్వమని సీఎం చంద్రబాబుకి సూచించామని తెలిపారు. పార్టీ మారుతూ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డ బలరాం... ఎమ్మెల్యే ఆమంచి పార్టీ మారినా టీడీపీకి వచ్చిన నష్టం ఏమీలేదన్నారు. పార్టీకి కష్టకాలంలోనే నేను గుర్తుకొస్తుంటానని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ కరణం బలరాం. అయితే, గతకొంతకాలంగా చీరాల నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా తిరిగి చీరాలకు చేరుకున్నారు... నిన్న తన అనుచరులతో కలిసి ర్యాలీ నిర్వహించిన ఆమె కూడా చీరాల స్థానాన్ని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీచేసిన పరాజయం పాలైన సునీత... ఈ సారి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.