ఓటు విషయాన్ని బయటపెట్టిన ట్రంప్... 

ఓటు విషయాన్ని బయటపెట్టిన ట్రంప్... 

నవంబర్ 3 వ తేదీన అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయం పక్కన పెడితే, అధ్యక్షుడు ట్రంప్, ప్రత్యర్థి జో బైడెన్ లు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.  ట్రంప్ కు మధ్యలో కరోనా సోకడంతో కొన్ని రోజులు ప్రచారానికి దూరంగా ఉన్నారు.  కోలుకున్న వెంటనే తిరిగి ప్రచారం మొదలుపెట్టారు.  కాగా, నవంబర్ 3 వ తేదీన జరిగే ఎన్నికల కంటే ముందుగానే ట్రంప్ తన ఓటును ఫ్లోరిడాలోని ఓ లైబ్రరీలో వినియోగించుకున్నారు.  ట్రంప్ అనే పేరుగల అభ్యర్ధికి ఓటు వేసినట్టు పేర్కొన్నారు.  ఈ ఓటు చాలా విలువైనదని, జాగ్రత్తగా ఓటు వేయాలని ట్రంప్ కోరారు.  ప్రచార సమయంలో కూడా మాస్క్ తో కనిపించని ట్రంప్ ఓటు వేసే సమయంలో మాత్రం భిన్నంగా మాస్క్ పెట్టుకొని కనిపించారు.  కరోనా మహమ్మారి కారణంగా దాదాపుగా 5.5 కోట్ల మంది అమెరికన్లు ముందస్తుగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.