కమెడియన్ని తెగ పొగిడిన గౌతమ్ మీనన్!

కమెడియన్ని తెగ పొగిడిన గౌతమ్ మీనన్!

అతనేమో సీరియస్ ఫిల్మ్స్ తీసే టాలెంటెడ్ డైరెక్టర్. ఇతనేమో క్రేజీ కమెడియన్. కానీ, ఆ దర్శకుడికి కమెడియన్ తెగ నచ్చేశాడు. ''నీతో కలసి వర్క్ చేసేందుకు ఎదురుచూడలేకపోతున్నాను'' అంటూ ట్వీట్ కూడా చేశాడు. ఇంతకీ, సీరియస్ డైరెక్టర్ని మెస్మరైజ్ చేసిన ఆ కోలీవుడ్ కమెడియన్ ఎవరో అర్థమైందా? యోగి బాబునే! రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో యోగి బాబు నటించాడు. ఇంకా అనేక సినిమాలు ఆయన చేశాడు. ప్రస్తుతం చేతిలో కూడా అనేక చిత్రాలున్నాయి. అయితే, కొన్నాళ్ల కిందట విజయ్ టీవీలో డిజిటల్ గా విడుదలైంది 'మండేలా' మూవీ. ఇందులో కథ ఎలక్షన్స్ నేపథ్యంలో సాగుతుంది. ఒక్క ఓటు కోసం అన్ని పార్టీలు యోగి బాబును కాక పడుతుంటాయి. ఆ క్రమంలో ఉత్పన్నం అయ్యే కామెడీని బాగా పండించాడు యోగి. అది చూశాకే టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ స్పందించాడు!

దర్శకుడికి, ఇతర నటీనటులకి, మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా శుభాకాంక్షలు చెప్పిన గౌతమ్ మీనన్ స్టార్ కమెడియన్ని మాత్రం ప్రత్యేకంగా ఆకాశానికి ఎత్తేశాడు. నీతో మూవీ చేసేందుకు నేను వెయిట్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ గౌతమ్ ట్వీట్ యోగి బాబు ఫ్యాన్స్ లో తెగ వైరల్ అవుతోంది! చూడాలి మరి, త్వరలో గౌతమ్, యోగి కాంబినేషన్ లో ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతుందేమో!