ఒక హిందువుగా అక్కడికి వెళ్ళను : సీఎం యోగి 

ఒక హిందువుగా అక్కడికి వెళ్ళను : సీఎం యోగి 

ఆగష్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం భూమిపూజ జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో పీఎం మోడీతో సహా సీఎం యోగి పాల్గొన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వివాదాస్పద స్థలంలో మసీదును కూడా నిర్మించాల్సి ఉన్నది. ఒకవేళ ఆ మసీదు ప్రారంభోత్సవానికి ఆహ్వానం వస్తే, ఆ కార్యక్రమానికి ఓ హిందువుగా తాను వెళ్ళను అని సీఎం యోగి తెలిపారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఒక సీఎంగా తనకు మతాలతో ఎటువంటి సమస్య లేదని..  తలకు టోపీ పెట్టుకుని రోజా, ఇఫ్తార్‌లకు వెళ్లేవారు సెక్యులర్ అన్నట్లుగా చెప్పుకుంటున్నారని సీఎం యోగి ఆరోపించారు. మసీదు ప్రారంభోత్సవానికి వెళ్లను... ఒక హిందువుగా ఆ పని చేయను అని యోగి అన్నారు. మసీదు నిర్మాణంలో తాను భాగస్వామ్యం కానని యోగి పేర్కొన్నారు.