గన్నవరం ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నా : వల్లభనేని వంశీ

గన్నవరం ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నా : వల్లభనేని వంశీ

మూడు రాజధానుల మీద గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమరావతి మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి లేదని, అన్ని ప్రాంతాలను సమంగా చూడాలనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. లేకపోతే తెలంగాణలో వచ్చినట్లు అసమానతలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. గన్నవరం ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానన్న ఆయన సీఎం జగన్ కు ఆ విషయం తెలియచేశానని అన్నారు.

కరోనా కారణం గా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు అని ఆగానని అన్నారు. రాజధాని తరలింపు విషయంగా తన ప్రాంత రైతులు కొంత నష్టపోయారని అందుకే నా ఉప ఎన్నిక ఫలితాన్ని రాజధాని మార్పుపై ప్రజాభిప్రాయంగా చూసినా నాకు సమ్మతమేనని అన్నారు. గన్నవరం ఎన్నికను రాజధాని మార్పుతో ముడి పెట్టాలా వద్దా అనేది టీడీపీ తేల్చుకోవాలని అన్నారు. మూడు రాజధానుల పై అసెంబ్లీ రద్దు చెయ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన వంశీ ఎన్నికలు జరుగుతాయంటే ఇప్పుడే రాజీనామాకు సిద్ధమని అన్నారు.