హైదరాబాద్ ముందు 164 పరుగుల లక్ష్యం... ఛేదిస్తుందా?
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. బెంగళూరు చేసింది భారీ స్కోర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ పిచ్ చాలా స్లో గా ఉంటుంది. అయితేరెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి హైదరాబాద్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. దేవ్ దత్ పడిక్కల్, ఆరోన్ పించ్ లు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 90 పరుగుల భాగస్వామ్యం అందించారు. పడిక్కాల్ మొదటి మ్యాచ్ లోనే ఆకట్టుకున్నాడు. 42 బంతుల్లో 56 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ కు సహకరించడగా, డివిలియర్స్ మరోమారు జట్టును ఆదుకున్నాడు. కాగా, హైదరాబాద్ ముందు 164 పరుగుల భారీ లక్ష్యం ఉన్నది. మరి ఈ లక్ష్యాన్ని హైదరాబాద్ ఛేదిస్తుందా చూద్దాం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)