హైదరాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్... ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్... ఇద్దరు అరెస్ట్

ఐపీఎల్ 2021 క్రికేట్ బెట్టింగుకి పాల్పడుతున్న ఇద్దరిని అదుపులొకి తిసుకుని వీరి నుండి 76 వేల రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధినము చేసుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు. హుసేని ఆలం పొలిసు పరిధి మూసా బౌలికి చెందిన యోగేష్ యాదవ్, మంగల్ హాట్ ప్రాంతానికి చెందిన ధర్మేందర్ సింగ్...ఐపిఎల్ 2021, ముంబై ఇండియన్స్... వర్సస్...సన్ రైసేస్ హైద్రబాద్ క్రికేటు మ్యాచుకి క్రికేట్ లైన్ గురు ఆప్ ద్వారా వీరు సబ్ బుకీస్, డబ్బు కలేక్షన్ ఏజేంట్లుగా చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్న సమాచారముతొ స్థానిక పొలిసులతొ కలిసి సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు ఈ ఇద్దరిని అదుపులొకి తీసుకుని వీరి నుండి 76 వేల రూపాయల నగదు. 2 సెల్ ఫోన్లు స్వాధినము చేసుకున్నారు. క్రికేటు బెట్టింగుకి పాల్పడుతున్న ప్రధాన నిందితుడు జియాగూడ ప్రాంతానికి చెందిన ఆరిగా సాయి పరారిలొ ఉన్నాడు. అదుపులొకి  తిసుకున్న ఇద్దరు సబ్ బుకీలతొ పాటు స్వాధినము చేసుకున్న నగదు, సెల్ ఫోన్లను తదుపరి విచారణ కొరకు స్థానిక హుసేనిఆలం పొలిసులకు అప్పగించారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు.