పరువు హత్య కేసు...సంచలన విషయాలు భయటపెట్టిన అవంతిక..!

పరువు హత్య కేసు...సంచలన విషయాలు భయటపెట్టిన అవంతిక..!

హైదరాబాద్ లో పరువు హత్య కలకలం రేపింది. చందానగర్‌లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా యువతి తండ్రి లక్ష్మారెడ్డి అమ్మాయి మేనమామ సాయంతో నమ్మించి హేమంత్‌ను బయటికి తీసుకెళ్లారు. అనంతరం కొండాపూర్ మండలం కిష్టాయగూడెం శివాయలోని చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహాన్ని  పడినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ ఘటనపై హేమంత్ భార్య అవంతి స్పందించారు. తాము నాలుగు నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్నామని అన్నారు. పోలీసుల సమక్షంలో రాజీ కుదిరిందని , బెదిరింపులు సహజంగానే వస్తూ ఉన్నాయని తెలిపారు.తన పేరు మీద ఉన్న ప్రాపర్టీ మొత్తం కూడా ఇచ్చేశానని అన్నారు. నిన్న మధ్యాహ్నం తమ ఇంట్లో కి  తన మేనమామ విజేందర్రెడ్డి తో పాటు ఇద్దరు మేనబావలు మరొక ఇద్దరు వచ్చారని పేర్కొంది. తనకి మాయమాటలు చెప్పి హేమంత్ ను కార్లో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తామని చెప్పారని తెలిపింది. కొద్ది దూరం వెళ్లాక తనకు అనుమానం వచ్చి కేకలు పెట్టానని ,రింగ్ రోడ్డు వైపు తీసుకెళ్లిన తర్వాత తనను అక్కడే వదిలేసి హేమంత్ను కొట్టుకుంటూ తీసుకొని పోయారని పేర్కొంది. ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని 40 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారని పేర్కొంది. ఇవాళ ఉదయం చనిపోయినట్లుగా తమకు పోలీసులు చెప్పారని తెలిపింది. కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయని అత్యంత దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన  మేనమామతో పాటు మరో ఇద్దరు కలిసి హత్య చేశారని వెల్లడించింది.