బీసీసీఐ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హైదరాబాద్ ఫ్యాన్స్...
ఈ సీజన్లో ఏ జట్టూకూ సొంతగడ్డపై ఆడే అవకాశం లేదు. అన్నీ తటస్థ వేదికల్లోనే తలపడనున్నాయి. హైదరాబాద్, పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంఛైజీల నగరాలను మ్యాచ్‌ల కోసం ఎంపిక చేయకపోవడంతో.. ఏ జట్టుకూ ఆతిథ్య సానుకూలత ఉండొద్దన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఆటగాళ్లు వైరస్ బారిన పడకూడదన్న ఉద్దేశంతో లీగ్ దశలో ఒక్కో జట్టు మూడు సార్లు మాత్రమే ప్రయాణం చేసేలా షెడ్యూల్ రూపొందించారు. ఏప్రిల్ 11న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు ఫ్రాంచైజీలకు హోమ్ గ్రౌండ్ ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌కు హోం గ్రౌండ్ లేకుండా పోయింది.
హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ ఐపీఎల్ గవర్నింగ్స్ కౌన్సిల్‌తోపాటు బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక మొహాలీ వేదికగా నిర్వహించాలని పంజాబ్ ముఖ్యమంతి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా బీసీసీఐని కోరారు. కానీ వారి విజ్ఞప్తులను బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు.
కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ముంబై నగరంలో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించడం అవసరమా అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాదిలోని చెన్నై, బెంగళూరులో నిర్వహించి పక్కనే ఉన్న హైదరాబాద్‌ను పట్టించుకోకపోవడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. ఏ ఫ్రాంఛైజీ లేని అహ్మదాబాద్ లో మ్యాచ్ నిర్వహించడంపై మండిపడుతున్నారు హైదరాబాద్ ఫ్యాన్స్. ఏదీ ఏమైనా ఐపీఎల్ తాజా షెడ్యూల్‌తో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)