బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు.. మరోసారి స్పందించిన సీపీ అంజనీకుమార్

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు.. మరోసారి స్పందించిన సీపీ అంజనీకుమార్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.. ఈ కేసులో జరిగిన పరిణామాలను ఇప్పటికే మీడియాకు వెల్లడించిన హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్.. ఇవాళ మరోసారి ఈ కేసుపై స్పందించారు.. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్న ఆయన.. ఇప్పటికే భూమా అఖిలప్రియను దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.. విచారణలో వచ్చిన వాస్తవాలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ లను కూడా కోర్టు ముందు ఉంచనున్నట్టు చెప్పారు సీపీ.. ఇక, ఈ కేసులో ఇతర నిందితులను మరో రెండు రోజుల్లో‌పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. అఖిలప్రియ పోలీస్ కస్టడి పూర్తయిన తర్వాత రేపు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ కేసులో ఏ-1గా ఉన్న భూమా అఖిలప్రియను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నారు.. ఆమెకు బెయిల్‌ను తిరస్కరించిన కోర్టు.. పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇక, రోజురోజుకీ ఈ కేసులు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. బాలీవుడ్‌ సినిమాను చూసి ఈ కిడ్నాప్‌నకు స్కెచ్‌ వేశారని చెబుతున్నారు పోలీసులు.