ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం

ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం
సొంతగడ్డపై హైదరాబాద్ మళ్లీ అదరగొట్టింది... ఐపీఎల్‌లో వరుసగా రెండో విక్టరీ సాధించింది... ఉప్పల్ స్టేడియంలో లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠబరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఒక వికెట్ తేడాతో విక్టరీ కొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్‌... ప్రత్యర్థిపై చెలరేగిపోయే ముంబై నిన్నటి మ్యాచ్‌లో కాస్త తడబడింది... సన్‌రైజర్స్ అసాధారణ బౌలింగ్‌కు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, స్టాన్‌లేక్, సిద్ధార్థ్ కౌల్ తలో రెండు వికెట్లు తీసి అదరగొట్టి... ముంబైని కట్టడి చేశారు. ఇది ఐపీఎల్‌లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్‌గా చెప్పాలి... ఉప్పల్ స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లాస్ట్ బాల్‌కు విజయం సాధించింది హైదరాబాద్‌. 148 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్ రైజర్స్... మొదట రెచ్చిపోయి బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, సాహా జోరుకు 6.5 ఓవర్లలోనే 62 రన్స్ చేసింది. గెలుపు ఇక లాంఛనమే అనుకుంటున్న సమయంలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. సాహా, విలియమ్స్ సన్, ధావన్ వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్లు కూడా క్రీజ్‌లో నిలవలేదు... దీంతో 137 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది హైదరాబాద్... చివరి ఓవర్లో సన్ రైజర్స్ విజయానికి 11 పరుగులు కావాలి... తొలి బంతినే సిక్స్‌గా మలిచాడు కొడా... ఆ తర్వాత నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు వచ్చాయి. ఇక చివరి బంతిని ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అంధించాడు స్టాన్‌లేక్...