'టిక్‌టాక్‌' చేస్తోందని భార్యను చంపేసిన భర్త

'టిక్‌టాక్‌' చేస్తోందని భార్యను చంపేసిన భర్త

'టిక్‌టాక్‌' వాడొద్దని చెప్పినా వినకపోవడంతో భార్యను హత్య చేశాడో భర్త. తమిళనాడులో సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

తమిళనాడులోని కోవై ప్రాంతానికి చెందిన కనకరాజ్‌ (35), నందిని (28) దంపతులు. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుటుంబ తగాదాల కారణంగా కనకరాజ్‌, నందినిలు కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో టిక్‌టాక్‌కు అడిక్ట్‌ అయిన నందిని.. రోజూ పదుల సంఖ్యలో వీడియోలను అప్‌లోడ్‌ చేసేది.

ఓ మిత్రుడి ద్వారా ఈ విషయం తెలియడంతో కనకరాజ్‌ ఆవేశంతో ఊగిపోయాడు. నందినికి ఫోన్‌ చేసిన టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్‌ చేయడం మానుకోవాలని సూచించాడు. అయినా ఆమె వినకపోవడంతో నందిని పని చేస్తున్న కళాశాలకు మద్యం తాగి వెళ్లాడు. ఆమెతో గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఆమెను కత్తితో పొడిచి పరారయ్యాడు.