భార్యను హత్య చేసిన భర్త

భార్యను హత్య చేసిన భర్త

హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఫర్హత్ నగర్ కు చెందిన హైదర్ ఖాన్ అనే వ్యక్తి తన మూడవ భార్యను హత్య చేసాడు. ఈ విషయం తెలుకున్న పోలీసులు.. హైదర్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. హైదర్ ఖాన్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లిని ప్రశ్నించారు పోలీసులు. భార్యను చంపిన అనంతరం హైదర్ దుబాయ్ కు పారిపోయినట్లుగా పోలీసుల అనుమానిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హైదర్ ఖాన్ ఇంతకుముందే ఇద్దరిని వివాహమాడాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు హైదర్ ఖాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ హత్య ఎందుకు జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.