కరీంనగర్‌లో భార్యపై భర్త కాల్పులు

కరీంనగర్‌లో భార్యపై భర్త కాల్పులు

కట్టుకున్న భార్యపైనే భర్త కాల్పులు జరిపిన ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించింది... తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో భార్యపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు భర్త... రామకృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న ఊబిది కనకయ్య... తన భార్య స్వప్నపై కాల్పులు జరిపాడు... అమె తొడపై కాల్చడంతో తీవ్రగాయం అయ్యింది. దీంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నాటు తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. అసలు భర్త కాల్పులు ఎందుకు జరిపారన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబసమస్యలేనా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.