లాక్‌డౌన్‌లో ప్రియురాలితో భర్త రాసలీలలు.. పట్టించిన భార్య..!

లాక్‌డౌన్‌లో ప్రియురాలితో భర్త రాసలీలలు.. పట్టించిన భార్య..!

లాక్‌డౌన్‌లోనూ ఇల్లు విడిచి.. ప్రియురాలితో రాసలీలలు కొనసాగిస్తున్న తన భర్తను పోలీసులకు పట్టించింది భార్య.. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వెలుగు చూసింది.. వివరాల్లో వెళ్తే.. హైదరాబాద్‌ శివారులోని ఓ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్‌గా ఎన్నికైన అనిల్ అనే వ్యక్తి.. లాక్‌డౌన్ సమయంలోనూ ఓ లాడ్జిలో చేరి ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు.. లాడ్జి యజమాని కూడా అనిల్‌కు తోడు కావడంతో అమ్మాయిలను పిలిపించుకుని రాసలీల్లో మునిగిపోతున్నారు.. ఇక, ఇవాళ కూడా  పనిఉందంటూ బయటకు వెళ్లాడు.. లాడ్జిలో ప్రియురాలితో రాసలీలల్లో మునిగిపోయాడు.. అయితే, ఈ విషయాన్ని పసిగట్టిన అతని భార్య... లాడ్జిలో వ్యభిచార ముఠా ఉందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చింది.. దీంతో వనస్థలిపురంలోని లాడ్జిపై దాడి చేశారు పోలీసులు.. ముగ్గురు అమ్మాయిలతో పాటు అనిల్, లాడ్జి యజమాని సునీల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.