క్రికెట్ బెట్టింగ్ లో కొత్త పుంతలు... భార్యాభర్తలు కలిసి...

క్రికెట్ బెట్టింగ్ లో కొత్త పుంతలు... భార్యాభర్తలు కలిసి...

క్రికెట్ బెట్టింగ్ లో కొత్త పుంతలు తొక్కుతుంది. భార్యాభర్తలు కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్న వైనం బయటపడింది. పోలీసులకు దొరికిపోతాను అనే భయంతో గోవాలో ఉండి బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు రాహుల్. గోవాలో ఉండి భర్త క్రికెట్ బెట్టింగ్ నడుపుతుంటే.. హైదరాబాదులో పందెం కాసే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంది భార్య. విషయం తెలుసుకొని భార్యాభర్తలను పట్టుకున్నారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్  పోలీసులు. ఉన్నత ఉద్యోగం చేస్తున్నాం అంటూ తమ కుటుంబాన్ని నమ్మించాడు రాహుల్. తాను చెప్పే ఫోన్ నెంబర్ ల వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలంటూ భార్యకు చెప్పాడు. అప్పటినుండి మోటార్ సైకిల్ పై వెళ్లి పందెం కాసే రాయుళ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంది భార్య సుమలత. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి పెద్ద మొత్తంలో బెట్టింగ్ కు పాల్పడ్డారు భార్యాభర్తలు. దాంతో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.