కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్లమ్ ఏరియా బాగ్‌బజార్‌లో... మంటలు చెలరేగి... పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయ్‌. అగ్నికీలలు... మయేర్ బారీకి వ్యాపించాయి. పక్కనే ఉన్న ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. ఇంతలోనే భారీ శబ్ధాలు విన్పించాయి. సిలిండర్లు పేలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది... 24 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికులను అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ కమ్మేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.